వేగంగా దూసుకొచ్చిన ద్విచక్రవాహనం అదుపుతప్పి ఫ్లైఓవర్ డివైడర్‌ను ఢీకొనగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గోపాలపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మారేడుపల్లికి చెందిన కిరణ్‌కుమార్... రైట్ క్లిక్ టెక్నాలజీస్‌లో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు అతను నడుపుతున్న బైకు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఘటనలో కిరణ్ తలకు తీవ్రగాయాలై అతను అక్కడికక్కడే మరణించాడు.
బైకు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి - road accident ar gopalpuram police station one person died
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గోపాలపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో వేగంగా దూసుకొచ్చిన ఓ బైకు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనగా ఓ వ్యక్తి మరణించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు.
బైకు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి
సమాచారమందిన పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతని మరణంతో మారేడుపల్లిలోని కిరణ్ నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి అతివేగమే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.