మల్కాజిగిరి జిల్లా గండిమైసమ్మ - దుండిగల్ మండలం పరిధిలోని బహుదూర్ పల్లి సాయినాథ్ సొసైటీలో వెలసిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. గత 16 ఏళ్లుగా ప్రభుత్వ అసైన్డ్ భూమి అంటూ కోర్టు కేసులో ఉన్న స్థలంలో వారం రోజులుగా చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించారు. నాలుగు బేస్మెంట్లు, ప్రహరిని నేలమట్టం చేశారు.
అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు - దుండిగల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గండిమైసమ్మ-దుండిగల్ మండల పరిధిలోని బహుదూర్ పల్లి సాయినాథ్ సొసైటీలో వెలసిన అక్రమ నిర్మాణాలను దుండిగల్ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.
అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు
ఆక్రమణదారులపై ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. మరోసారి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:రాష్ట్ర రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది: సీఎస్