మద్దతుదారులతో చర్చలు
గడప గడపకు వెళతా... గెలుస్తా : రేవంత్‌రెడ్డి - congress mp candidate
మల్కాజిగిరి లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి తాను గెలవాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించనున్నారు. ఈ నెల 22న భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు.

అధిష్ఠానం నుంచి ప్రకటన రాగానే లోక్‌సభ సీటు ఆశిస్తున్న కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌తో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంను కలసి మద్దతు కోరారు. వారంతా సానుకూలంగా స్పందించారని తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఇష్టం లేకపోయినా సీనియర్ నాయకుల సలహా మేరకే బరిలోకి దిగానని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
ఇదీ చదవండి:"కేసీఆర్‌పై చర్యలు తీసుకోండి"