మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారం లింగం (కట్టమైసమ్మ) చెరువు ఆక్రమణలపై ఈనాడు-ఈటీవీ భారత్‌లో వచ్చిన 'చెరువుల్లో అనకొండలు' కథనంపై అధికారులు స్పందించారు. కట్టను సందర్శించి అక్రమ నిర్మాణాలపై ఆరా తీశారు. రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులు.. కట్టపై వెలిసిన పెట్రోల్ బంక్, ఓ భవన నిర్మాణానికి సంబంధించిన పత్రాలు పరిశీలించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిస్తామని అధికారులు తెలిపారు.
కట్టమైసమ్మ చెరువు ఆక్రమణలపై ఈటీవీభారత్ కథనానికి స్పందన
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారం కట్టమైసమ్మ చెరువు ఆక్రమణలపై ఈనాడు-ఈటీవీ భారత్‌లో వచ్చిన 'చెరువుల్లో అనకొండలు' కథనంపై అధికారులు స్పందించారు. కట్టను సందర్శించిన రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులు.. కట్టపై పెట్రోల్ బంక్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారం లింగం (కట్టమైసమ్మ) చెరువు విస్తీర్ణం 15.40 ఎకరాలు. దీని కింద పాతిక ఎకరాలకు పైగా ఇనాం భూములు సాగులో ఉండేవి. ఇప్పుడు అవెక్కడా కనిపించవు. చెరువుకున్న రెండు తూములు మూసేసి భవనాలు నిర్మించారు. కట్టపైనే నిర్మాణాలు చేపట్టారు. అలుగు, కాల్వలను మళ్లించారు. దీని కింద నాలుగు గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. చెరువు కట్టపై చేపట్టిన నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చేశారు. కట్టపై ఏకంగా పెట్రోల్ బంకు నడిపిస్తున్నారు. ఆ పక్కనే చదును చేసి మట్టిపోస్తున్నారు. ఇదే చెరువుకు మరోవైపు బఫర్ జోన్‌లోకి వచ్చి ఓ స్థిరాస్తి వ్యాపారి వెంచరు వేస్తున్నారు. ఇప్పటికే మట్టి పోసి రేకులతో కంచె కట్టేసిన అనంతరం అనుమతులకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. చెరువుకట్ట ఆక్రమణకు గురైందని 2018లో నీటిపారుదల శాఖ ఇంజినీర్లు రెవెన్యూశాఖకు ఫిర్యాదు చేసినా, తెరవెనుక కొందరు పెద్దలు ఉండటంతో ఎవరూ పట్టించుకోలేదు.
- సంబంధిత కథనం :భాగ్యనగరంలో కోట్ల విలువైన భూములు ఆక్రమణ