నేటి నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ, మల్కాజిగిరి, కీసర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు కార్యాలయాలకు వచ్చారు.
మేడ్చల్ జిల్లాలో ప్రారంభమైన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు
మూడు నెలల అనంతరం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ అయింది.
మేడ్చల్ జిల్లాలో ప్రారంభమైన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు
ఈరోజు అమావాస్య కావడంతో రిజిస్ట్రేషన్లు తక్కువగా వుండే అవకాశం ఉందని అధికారులు అన్నారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ కోసం పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ఇదీ చదవండి:వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం