గ్రేటర్ ఎన్నికల్లో కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెరాస నుంచి కేపీహెచ్‌బీ కాలనీలో మందాడి శ్రీనివాసరావు, ఆల్విన్ కాలనీ డివిజన్లో వెంకటేశ్ గౌడ్, కూకట్‌పల్లిలో జూపల్లి సత్యనారాయణ, ఓల్ట్ బోయిన్‌పల్లిలో ముద్దం నర్సింగ్ యాదవ్, అల్లాపూర్‌లో సబియా గౌసుద్దీన్, ఫతేనగర్‌లో పందాల సతీశ్ గౌడ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.
గ్రేటర్లో జోరుగా అసమ్మతి నేతల నామినేషన్లు - మేడ్చల్ జిల్లా తాజా వార్తలు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. పలు రాజకీయ పార్టీలు పేర్లు ప్రకటించిన నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అదే స్థాయిలో అసమ్మతి నేతలు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
గ్రేటర్లో జోరుగా అసమ్మతి నేతల నామినేషన్లు
కాంగ్రెస్ నుంచి కూకట్‌పల్లిలో తేజేశ్వరరావు, బాలానగర్‌లో సత్యం శ్రీరంగం బరిలో నిలిచారు. తేదేపాలో హైదర్‌నగర్‌లో ఒక్కరే నామినేషన్ వేయగా, కేపీహెచ్‌బీ నుంచే ఇద్దరు పోటీకి సిద్ధమయ్యారు. భాజపా తరపున ఆల్విన్‌కాలనీలో నలుగురు, కూకట్‌పల్లిలో ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మొత్తంమీద గ్రేటర్లో అన్ని రాజకీయ పార్టీలకు అసమ్మతి నేతల సెగ తగులుతోంది.