మేడ్చల్ జిల్లా బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ పారిశ్రామిక వాడలోని భారీ ప్రమాదం సంభవించింది. ఘటనలో ముగ్గురు కార్మికులు గాయపడినట్లు పరిశ్రమ సిబ్బంది వెల్లడించారు.
రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్.. ముగ్గురికి గాయాలు - రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్
ఓ రసాయన పరిశ్రమలో రియాకర్ట్ పేలి ముగ్గురికి గాయాలైన ఘటన మేడ్చల్‌లో చోటు చేసుకుంది. పేలుడు ధాటికి పరిశ్రమ మొదటి అంతస్తులో గోడలు కూలిపోయాయి. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో ప్రాణాపాయం తప్పింది.

రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్.. ఇద్దరికి గాయాలు
ఓ ఫార్మా ల్యాబ్ పరిశ్రమలోని మొదటి అంతస్తులో రియాక్టర్ పేలి... భారీ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నందున భవనంలోని మొదటి అంతస్తులో గోడలు పూర్తిగా కూలిపోయాయి. సమాచారం తెలుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.
రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్.. ఇద్దరికి గాయాలు
ఇదీ చూడండి:రాజ్‌భవన్ ఎదుట నిరసన చేయడం లేదు: కాంగ్రెస్
Last Updated : Jul 27, 2020, 9:43 AM IST