మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 డివిజన్ వెంకటేశ్వర కాలనీలో భాజపా ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. చిన్నపాటి వర్షానికే బురదమయమైన రహదారిపై వరి నాట్లు వేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల అలసత్వానికి ఇది నిదర్శనమని నాయకులు ప్రసాద్ గౌడ్, నటరాజ్ మండిపడ్డారు.
రోడ్లు బురదమయం.. రహదారిపై వరినాట్లు వేసి నిరసన - Rains on the road and protest
కుత్బూల్లాపూర్ నియోజకవర్గంలోని వెంకటేశ్వర కాలనీలో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ బురదమయంగా మారాయి. ఇందుకు నిరసనగా భాజపా ఆధ్వర్యంలో రహదారిపై వరినాట్లు వేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రోడ్లు బురదమయం.. రహదారిపై వరినాట్లు వేసి నిరసన
చిన్నపాటి వర్షం పడితే చాలు.. కాలనీ ప్రధాన రహదారి మొత్తం బురద మయంగా తయారవుతోందని నాయకులు ఆరోపించారు. బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. కాలనీలోని రహదారులను బాగుచేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో మరోసారి సీరం సర్వే