మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సమీపంలోని నాగారం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళను ఆటో ఢీ కొట్టింది. ఘట్కేసర్కు వెళ్తున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఈ ఘటనను చూసి ఆగారు. గాయాలపాలైన నల్ల రాణి అనే మహిళకు ప్రథమ చికిత్స చేసి... తన వాహనంలోనే సమీప ఆసుప్రతికి తీసుకెళ్లారు. చికిత్స ఖర్చును సీపీ మహేశ్ భగవత్ చెల్లించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.
మానవత్వాన్ని చాటుకున్న రాచకొండ సీపీ - రాచకొండ సీపీ మహేశ్ భగవత్
రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మహిళకు ప్రథమ చికిత్స చేసి... తన వాహనంలోనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.
rachakonda cp mahesh bhagwat help latest news