రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రెండు అత్యవసర సర్వీసులను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రారంభించారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటి కౌన్సిల్ ఆధ్వర్యంలో ఒక అంబులెన్స్, యువత ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మరో అంబులెన్స్‌ను ప్రారంభించారు.
రెండు అంబులెన్స్‌లను ప్రారంభించిన సీపీ మహేష్ భగవత్
రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ రెండు అంబులెన్సులను ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు ఈ సర్వీసులను వినియోగించుకోవాలని తెలిపారు.
రెండు అంబులెన్స్‌లను ప్రారంభించిన సీపీ మహేష్ భగవత్
రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ఉన్న యాదాద్రి భువనగిరి, మల్కాజిగిరి, ఎల్బీ నగర్ ప్రాంతాల్లోని వారు ఈ సర్వీసులను ఉపయోగించుకోవాలని అన్నారు. కొవిడ్-19 నేపథ్యంలో 108 సర్వీసులు దొరకడం లేదని.. ఎవరైనా అత్యవసర సమయంలో ఉన్నవారు ఈ సర్వీసులను వాడుకోవాలని అన్నారు.
ఇవీ చూడండి: వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యున్నత స్థాయి సమీక్ష