తెరాస కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే కేపి వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ హెచ్చరించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం డివిజన్ పరిధిలోని బతుకమ్మ బండ, కట్ట మైసమ్మ బస్తీలలో ప్రచారం నిర్వహించారు.
'తెరాస కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకోం' - ghmc elections news
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్నిడివిజన్లలో గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ధీమావ్యక్తం చేశారు. కార్యకర్తల ఇళ్లలోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. తమవారి జోలికొస్తే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు.
'తెరాస కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకోం'
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారన్నారు. తమ పార్టీ కార్యకర్తల ఇళ్లల్లోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీచూడండి:'తెలంగాణపై సవతి తల్లి ప్రేమ... ఇతర రాష్ట్రాలకు అమ్మ ప్రేమ'