తితిదే హిందూధర్మ ప్రచార సమితి నిర్వహిస్తున్న గోపూజ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పాల్గొన్నారు. సుభాశ్నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన పూజకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
పురాణాల్లో గోమాతకు ప్రత్యేక స్థానం : ఎమ్మెల్యే కేపీ - సుభాశ్నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద
హిందూ సంప్రదాయంలో తల్లితో సమానంగా గోమాతను పూజిస్తారని మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. సుభాశ్నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో తితిదే హిందూధర్మ ప్రచార పరిషత్ నిర్వహించిన గోపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
గోపూజలో పాల్లొన్న కుత్బల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద
హిందూ సంప్రదాయంలో గోమాతను మాతృమూర్తితో సమానంగా పూజిస్తారని తెలిపారు. పురాణాల్లో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. గోవులను రక్షించిన వారికి మంచి ఫలితాలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో భాగం కావడం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇచ్చిందని వివేకానంద పేర్కొన్నారు.