కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.2500 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ధర్నాకు బయలుదేరుతున్న కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్‌ను జీడీమెట్ల పోలీసులు షాపూర్ నగర్‌లోని తన ఇంట్లో గృహనిర్బంధం చేశారు.
కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గృహనిర్భంధం - hyderabad news
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా, రాష్ట్ర సర్కారు రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు బయలుదేరుతున్న కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
![కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గృహనిర్భంధం kutbhullapur ex mla kuna srisailam goud house arrested in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9522299-698-9522299-1605174631089.jpg)
కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గృహనిర్భంధం
అలాగే మరికొంత మంది కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి పేట్‌బషీరాబాద్ పీఎస్‌కు తరలించారు. తెలంగాణలో ప్రతిపక్షాలు ఏ ధర్నాకు పిలుపునిచ్చినా పోలీసుల ద్వారా అణచివేయడం సరైంది కాదని ఆయన అన్నారు.
ఇవీ చూడండి: ప్రగతి భవన్ ముట్టడికి రైతు ఐక్యవేదిక విఫలయత్నం