అన్నదాత సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో... మేడ్చల్, డబీర్‌పురా పీఏసీఎస్ సొసైటీల్లో మొదటి విడతలో రూ. 25 వేల లోపు ఉన్న రుణాలకు రుణ మాఫీ పత్రాలను సంబంధిత రైతులకు ఆయన అందచేశారు.
రుణ మాఫీ పత్రాలు అందజేసిన మంత్రి మల్లారెడ్డి
రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లాలోని పలు పీఎసీఎస్ సొసైటీల్లో మొదటి విడతలో రూ. 25 వేల లోపు ఉన్న రుణాలకు రుణ మాఫీ పత్రాలను రైతులకు అందజేశారు.
రుణ మాఫీ పత్రాలు అందజేసిన మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ పీఏసీఎస్ సొసైటీలో 100 మందికి దాదాపు రూ. 14 లక్షలు, డబీర్‌పురా పీఏసీఎస్ సొసైటీలో 116 మందికి సుమారు రూ. 20 లక్షల రుణాలు మాఫీ అయినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా రుణ మాఫీ పత్రాలు అందుకున్న రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:టిక్‌టాక్ సీఈఓ పదవికి కెవిన్ రాజీనామా.. కారణమిదే