తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమ నిర్మాణం తొలగించాలని కాలనీ వాసుల ధర్నా - medchal distirct latest news

రోడ్డుపై నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని మేడ్చల్ జిల్లా కాప్రా మున్సిపల్ కార్యాలయం వద్ద సౌత్ కమలనగర్ కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. ఈ అక్రమ నిర్మాణంపై ఛైర్మన్​, ఎమ్మెల్యేతోపాటు ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.

protest for remove illegal contraction in medchal distirct
అక్రమ నిర్మాణం తొలగించాలని కాలనీ వాసుల ధర్నా

By

Published : Sep 2, 2020, 3:29 PM IST

మేడ్చల్ జిల్లా కాప్రా మున్సిపల్ కార్యాలయం వద్ద సౌత్ కమలనగర్ కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. కాలనీలో నడి రోడ్డుపై అక్రమంగా నిర్మాణం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై ఉన్న నాలపై అక్రమ నిర్మాణం జరగడం వల్ల చుట్టుపక్కల ఉన్న స్థానికుల ఇళ్లలోని డ్రైనేజీ వాటర్ బయటకు వెళ్లడం లేదన్నారు.

తమకు కోర్టు ఆర్డర్ ఉన్నా మున్సిపల్ అధికారులకు లంచం ఇచ్చి పర్మిషన్ తెచ్చుకొని నాల ఉన్నటువంటి రోడ్డుపై ఇల్లు కడుతున్నారని ఆరోపించారు. ఈ అక్రమ నిర్మాణంపై ఛైర్మన్​, ఎమ్మెల్యేతోపాటు ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.

ఇవీచూడండి:రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువుల సరఫరా చేయండి: కిషన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details