తెలంగాణ

telangana

ETV Bharat / state

కేపీహెచ్​బీ వద్ద పోలీసుల వాహన తనిఖీలు - traffic jam at kphb

రాష్ట్రంలో లాక్​డౌన్ నిబంధనలను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిని అడ్డుకుంటున్నారు. సరైన అనుమతి పత్రాలు లేని వాహనాలను సీజ్​ చేస్తున్నారు.

కేపీహెచ్​బీ వద్ద పోలీసుల వాహన తనిఖీలు
కేపీహెచ్​బీ వద్ద పోలీసుల వాహన తనిఖీలు

By

Published : May 20, 2021, 12:30 PM IST

కరోనా కట్టడి కోసం లాక్​డౌన్​ను నేటి నుంచి పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్​రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. 10 దాటాక రోడ్లపైకి వస్తున్న వాహనదారులను ఆపి వివరాలు తెలుసుకుంటున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు.

ఉదయం 10 తరువాత కూడా వాహనాల సంచారం ఉండటంస పోలీసుల తనిఖీలతో కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. అనుమతి పత్రాలు ఉన్న వాహనాలనే పోలీసులు అనుమతిస్తున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను జప్తు చేస్తున్నారు. ఉదయం 10 గంటలలోపే పనులన్నీ ముగించుకోవాలని ఎంత చెబుతున్నా.. ప్రజలకు పట్టడం లేదు. 11:30 గంటల సమయంలోనూ ఇష్టారీతిన రోడ్లపై తిరుగుతున్నారు.

వాహనాల రద్దీ

ఇదీ చూడండి: పకడ్బందీగా లాక్​డౌన్.. ఉల్లంఘించిన వారిపై చర్యలు

ABOUT THE AUTHOR

...view details