రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీపీ మహేశ్ భగవత్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి నేడు ప్రారంభించారు.
దేశంలో అమెరికా తర్వాత అధిక పెట్రోలింగ్ వాహనాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. పోలీసుల పనితీరు కారణంగా రాష్ట్రంలో 75 నుంచి 80 శాతం వరకు నేరాలు తగ్గాయని తెలిపారు.