Srinivas Goud Case: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో నిందితులను ఐదురోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. నిందితులను ఇప్పటికే నాలుగు రోజులు విచారించినా.. ఎలాంటి సమాచారం రాకపోవటంతో మరోసారి మేడ్చల్ కోర్టులో పిటిషన్ వేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో మరోసారి నిందితుల కస్టడీకి పిటిషన్... - medchal court
Srinivas Goud Case: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో పోలీసులు మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే నాలుగు రోజులు విచారించిన నిందితులను మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. పిటిషన్‌పై మేడ్చల్ కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు
కేసులో నిందితులుగా ఉన్న రాఘవేందర్ రాజు, మున్నూరు రవిలను మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం రేపు తీర్పు ఇవ్వనుంది. మరోవైపు నిందితుల బెయిల్ పిటిషన్‌పైనా వాదనలు ముగియగా... ఎల్లుండి తీర్పు వెల్లడించనుంది.
ఇదీ చూడండి:మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర కేసులో ముగిసిన నిందితుల కస్టడీ