ఏసీపీ రాంరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది పోలీసులతో నిన్న రాత్రి హైదరాబాద్లోని బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని హరిజన బస్తీ ప్రాంతాన్ని క్షుణ్నంగా తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 17 ద్వి చక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ వెల్లడించారు. బేగంపేట ప్రజల్లో శాంతిభద్రతల పట్ల అవగాహన కలిగించేందుకు వారిలో ఉన్న అభద్రతా భావాన్ని దూరం చేసేందుకు తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
హరిజన బస్తీలో పోలీసుల నిర్బంధ తనిఖీలు.. - latest news of carter search in boinpally at hyderabad
హైదరాబాద్లోని బోయినపల్లి పీఎస్ పరిధిలోని హరిజన బస్తీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
బోయిన్ పల్లిలో పోలీసుల నజర్.. అభద్రతా భావం పోవాలనే
TAGGED:
నిర్బంధ తనిఖీలు