తెలంగాణ

telangana

ETV Bharat / state

Police help: కూలీ కుటుంబానికి ఆర్థిక సాయం - మేడ్చల్​ జిల్లా తాజా వార్తలు

ఓ గుత్తేదారు మాటలు నమ్మి లాక్​డౌన్​ సమయంలో హైదరాబాద్​ వచ్చి మోసపోయిన ఓ కుటుంబానికి కూకట్​పల్లి పోలీసులు చేయూతనిచ్చారు. విషయం తెలుసుకుని వారి సొంత ఇంటికి వెళ్లేందుకు ఆర్థిక సహాయం చేసి అవసరమైన టికెట్లను అందజేసి ఉదారత చాటుకున్నారు.

police help kukatpally labour family
Police help: కూలీ కుటుంబానికి ఆర్థిక సాయం

By

Published : May 28, 2021, 10:31 PM IST

లాక్‌డౌన్‌ సమయంలో కూకట్​పల్లికి ఉపాధి నిమిత్తం వచ్చి హైదరాబాద్​లోనే ఉండిపోయిన ఓ కుటుంబానికి… తమ సొంత గ్రామానికి చేరుకునేందుకు కూకట్​పల్లి పోలీసులు ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ కాంట్రాక్టర్ మాటలు విని హైదరాబాద్​ వచ్చి మోసపోయిన ఆ కుటుంబాన్నివారి ఇంటికి పంపేందుకు పోలీసులు ఆర్థిక సహాయం చేసి అవసరమైన టికెట్లను అందజేశారు.

ఏపీలోని ఒంగోలుకి చెందిన నాగరాజుకు నాలుగు రోజుల క్రితం కూకట్​పల్లి నుంచి ఓ కాంట్రాక్టర్ ఫోన్ చేసి పని ఉందని రావాల్సిందిగా తెలిపాడు. కాంట్రాక్టర్ మాటలు నమ్మిన నాగరాజు తన భార్య, ఇద్దరు పిల్లలతో ఒంగోలు నుంచి కూకట్​పల్లికి వచ్చి కాంట్రాక్టర్​కు ఫోన్ చేశాడు. కాంట్రాక్టర్ ఫోన్ స్విచాఫ్ రావడంతో తెచ్చుకున్న డబ్బులు సైతం అయిపోయాయి.

దీంతో మూడు రోజుల నుంచి భాగ్యనగర్ కాలనీ బస్​స్టాప్​లోనే కుటుంబంతో నాగరాజు తలదాచుకుంటున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున నాగరాజు కుటుంబాన్ని పెట్రోలింగ్ పోలీసులు చూసి సీఐ నర్సింహరావు దగ్గరికి తీసుకెళ్లారు. సీఐ వివరాలు తెలుసుకుని వారికి ఆర్థిక సహాయం చేసి, ఒంగోలుకు వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. సాయం చేసిన పోలీసులకు నాగరాజు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

ఇదీ చూడండి:corona: రాష్ట్రంలో మరో 3,527 కరోనా కేసులు, 19 మరణాలు

ABOUT THE AUTHOR

...view details