మేడ్చల్ జిల్లా బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్ (Malla Reddy Garden)లో పేకాట ఆడుతూ పట్టుబడ్డ మంత్రి మల్లారెడ్డి (Minister Malla Reddy) సోదరుడు నర్సింహరెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా ఆందోళన చేపట్టింది. మంత్రి మల్లారెడ్డిని బర్తరఫ్ చేయాలని మల్లారెడ్డి గార్డెన్ ఎదురుగా భాజపా రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు రామకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
కేసీఆర్ చిత్రపటాన్ని మల్లారెడ్డి గార్డెన్ (Malla Reddy Garden)కార్యాలయంలో పెట్టుకుని పేకాట స్థావరాలుగా మారుస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి(Minister Malla Reddy)కి సంబంధించిన కార్యాలయంలో అతని సోదరుడు పేకాట ఆడుతూ పట్టుబడ్డాడని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలన్నారు.