మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలు, ఆలయ భూములు, వాగులు కబ్జాకు గురవుతున్నాయని మూడో వార్డు కౌన్సిలర్ చింతల రాజశేఖర్ అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్కు ఫిర్యాదు చేశారు. కొందరు స్థిరాస్తి వ్యాపారులు.. వాగులు పూడ్చి చదును చేసి ఆక్రమణకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోచారం పురపాలికలో భూకబ్జాలపై కౌన్సిలర్ ఫిర్యాదు
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలు, ఆలయ భూములు, వాగులు కబ్జాలకు గురవుతున్నాయని కౌన్సిలర్ అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై గతంలో ఫిర్యాదు చేసినా తహసీల్దార్, హెచ్ఎండీఏ అధికారులు పట్టించుకోలేదని తెలిపారు.
పోచారం మున్సిపాలిటీ, పోచారం పురపాలిక, పోచారం పురపాలికలో భూకబ్జా
పురాతన ఆలయాన్ని కబ్జా చేసి.. ఆలయాన్ని చదును చేస్తుండగా గుప్తనిధులు బయటపడ్డాయని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పూర్తి విచారణ జరిపించాలని కోరారు. గతంలో తహసీల్దార్, హెచ్ఎండీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ కోరారు.