'విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడానికి లిటరరీ ఫెస్టివల్' - విద్యార్థుల్లో పఠనాశక్తి పెంచడానికి ప్లాన్ ఇండియా కార్యక్రమం
విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచడానికి ప్లానింగ్ ఇండియా సంస్థ.. జాతీయ స్థాయిలో అక్షరాస్యత మెరుగుపరచడానికి హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. మేడ్చల్‌లోని సీహెచ్‌ఏఐలో మూడు రోజుల పాటు లిటరరీ ఫెస్టివల్ పేరిట కార్యక్రమం జరుగుతోంది.
మేడ్చల్ జిల్లా సీహెచ్‌ఏఐలో లిటరరీ ఫెస్టివల్ కార్యక్రమం జరుగుతోంది. విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచడానికి ప్లానింగ్ ఇండియా సంస్థ జాతీయ స్థాయిలో అక్షరాస్యత మెరుగు పరచడానికి ఈ కార్యక్రమం చేపట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు బిహార్, దిల్లీ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజాస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, ఉత్తరఖండ్ తదితర ప్రాంతాల నుంచి 150 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ప్లానింగ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహ్మద్ ఆసిఫ్ తెలిపారు.