తెలంగాణ

telangana

ETV Bharat / state

తరలి వచ్చిన భక్తులు.. సందడిగా మారిన ఆలయాలు - రకారకాల సెట్టింగులు

కూకట్​పల్లిలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాల వద్ద వేసిన రకారకాల సెట్టింగులు భక్తులను ఆకట్టుకున్నాయి. శివలింగాలను అభిషేకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు.

pilgrims bustling temples at kukatpally
తరలి వచ్చిన భక్తులు.. సందడిగా మారిన ఆలయాలు

By

Published : Feb 21, 2020, 3:02 PM IST

కూకట్​పల్లిలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి. శాతవాహన కాలనీ ఉమామహేశ్వర ఆలయం, కేపీహెచ్​బీ రోడ్ నంబర్ మూడులోని కామాక్షి సమేత ఆలయాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

శివరాత్రి వేడుకల్లో భాగంగా ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. శివలింగాలకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో ఆలయాలు సందడిగా మారాయి.

తరలి వచ్చిన భక్తులు.. సందడిగా మారిన ఆలయాలు

ఇదీ చూడండి :బాధితులకు సాయం లేదు.. నిందితులకు ఉరిశిక్షలేదు...

ABOUT THE AUTHOR

...view details