Kukatpally constituency problems: కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్.. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో అల్ప ఆదాయ వర్గాలకు సంబంధించి సమస్యలు పరిష్కరించాలని వారు మంత్రికి వినతి పత్రం అందజేశారు. అలాగే నియోజక వర్గంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా కేపీహెచ్‌బీ డివిజన్లో సాయి నగర్ కాలనీ రెగ్యులరైజ్, రమ్య గ్రౌండ్‌ను జిల్లా పరిషత్ స్కూల్‌కు కేటాయించేటట్లు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని కలిసిన కూకట్పల్లి ప్రజా ప్రతినిధులు - Telangana latest news
Kukatpally constituency problems: అల్ప ఆదాయ వర్గాలకు సంబంధించి.. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసి నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులను మొదలు పెట్టాలని వినతి పత్రం ఇచ్చారు.
Madhavaram Krishna Rao meet Vemula Prashant Reddy
నియోజక వర్గంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించడానికి వీలుగా స్థలాన్ని కేటాయించావల్సిందిగా మంత్రిని కోరారు. 9 ఫేజ్‌లో ఉన్న రెండున్నర ఎకరాలను పార్కుకు కేటాయించాల్సిందిగా వినతి పత్రంలో పేర్కొన్నారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి వేముల.. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చదవండి:
Last Updated : Dec 18, 2022, 4:25 PM IST