రాష్ట్రంలో రెండో డోసు టీకా కోసం జనం ఆరోగ్యకేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాప్రా సర్కిల్ జమ్మిగడ్డలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జనం పోటెత్తారు. రెండో డోసు టీకా కోసం ఉదయం నుంచే బారులు తీరారు.
టీకా కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పోటెత్తిన జనం - తెలంగాణ వార్తలు
రెండో డోసు టీకా కోసం జనం స్థానిక ఆరోగ్య కేంద్రాలకు, ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు. కాప్రా సర్కిల్లోని జమ్మిగడ్డ పీహెచ్సీకి ఉదయం నుంచి బారులు తీరారు. తమ కేంద్రంలో దాదాపు వెయ్యి డోసులు ఉన్నాయని వైద్యులు తెలిపారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో టీకా పంపిణీ, జమ్మిగడ్డ ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్
ఆరోగ్య కేంద్రంలో కొవిషీల్డ్, కోవాక్సిన్ అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలిపారు. దాదాపు వెయ్యి మందికి సరిపోయే డోసులు ఉన్నాయని వెల్లడించారు.
ఇదీ చదవండి:దేశంలో 4లక్షల కరోనా కేసులు- 4వేల మరణాలు