మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ నగరపాలక సంస్థలో దాతల సహకారంతో కొవిడ్-19 ఐసోలేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, జడ్పీ ఛైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, మేయర్ జక్కా వెంకట్ పాల్గొని ఐసోలేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. కరోనా వైరస్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు.
కరోనా ఐసోలేషన్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
దాతల సహకారంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ సెంటర్‌ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. కరోనాతో కుటుంబసభ్యులతో సహా తాను ఎంతో ఇబ్బంది పడ్డానని.. ఆ పరిస్థితి రాకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని మంత్రి పేర్కొన్నారు.
పీర్జాదిగూడలో కరోనా ఐసోలేషన్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
ప్రతి ఒక్కరూ కరోనా నివారణ చర్యలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తనకు, తన కుటుంబానికి వైరస్ సోకడం వల్ల.. అనేక ఇబ్బందులు పడ్డామని ఆయన వెల్లడించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను మంత్రి కొనియాడారు. అనంతరం దాతలు ఏర్పాటు చేసిన 130 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.