మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధి సురారం లోని ఓ గోదాంలో కొందరు వ్యక్తులు సుమారు 100 క్వింటాలు రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచారు. విశ్వసనీయ సమాచారం మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు గోదాంపై దాడి చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు ఏఎస్వో అనిల్ వెల్లడించారు. బాధ్యులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు.
అక్రమంగా నిల్వ ఉంచిన 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - medchal district news
మేడ్చల్ జిల్లా సూరారంలో అక్రమంగా నిల్వచేసిన 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. ప్రభుత్వం కేవలం రూపాయికి కిలో బియ్యం నిరుపేదలకు అందిస్తుంటే... దానిని కొందరు అక్రమార్కులు వ్యాపారంగా మార్చుకుని దొడ్డిదారిన రాష్ట్రం దాటించి సొమ్ము చేసుకుంటున్నారు.
అక్రమంగా నిల్వ ఉంచిన 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఇవీ చూడండి: నకిలీ శానిటైజర్ తయారు చేస్తున్న వ్యక్తి అరెస్టు