తెలంగాణ

telangana

ETV Bharat / state

పెట్రోల్​ పోసి భర్తను వేధించిన.. భార్య, అత్త - మేడ్చల్ జిల్లా తాజా వార్తలు

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. కుటుంబ తగాదాలు కాస్తా భర్తను చంపేవరకు వెళ్లాయి. అది కూడా కట్టుకున్న భార్య, అత్త కలిసి భర్తపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. దీంతో అతని పరిస్థితి ఆందోళనకరంగా మారింది. స్థానికుల సాయంతో అతనిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Patrol murdered wife, aunt to husband at medipally medchal
పెట్రోల్​ పోసి భర్తను వేధించిన.. భార్య, అత్త

By

Published : May 12, 2020, 11:01 PM IST

మేడ్చల్ జిల్లా మేడిపల్లి కేంద్రనగర్​కు చెందిన సోను అనే వ్యక్తి గత కొంతకాలంగా భార్యతో గొడవలు పడుతున్నాడు. భార్య పక్క కాలనీలో పుట్టింటికి వెళ్లింది. సోమవారం భార్యను తీసుకెళ్దామని వెళ్లిన భర్తతో భార్య, అత్త మరోసారి గొడవ పడ్డారు. ఇద్దరూ కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించారు.

భర్త కేకలు వేయడం వల్ల స్థానికుల సహకారంతో అతనిని ఆస్పత్రికి తరలించారు. 55 శాతం శరీరం కాలిపోయిందని వైద్యులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి :రాష్ట్రంలో ఇవాళ 51 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details