యుద్ధ విమాన విన్యాసాలతో మేడ్చల్ జిల్లా దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కదనరంగాన్ని తలపించింది. అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వాయుసేన ఘనస్వాగతం పలికింది. వారి నుంచి గౌరవ వందనం స్వీకరించిన రాజ్‌నాథ్.. పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న వారి ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అవార్డులు ప్రదానం చేశారు.
కదనరంగాన్ని తలపించిన యుద్ధవిమాన విన్యాసాలు - Dundigal Air Force Academy in medchal district
మేడ్చల్ జిల్లా దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ అట్టహాసంగా జరిగింది. నింగిలో విమానాల విన్యాసాలను చూసి అంతా ఫిదా అయ్యారు.
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో యుద్ధ విన్యాసాలు
యుద్ధవిమాన విన్యాసాలతో దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కదనరంగాన్ని తలపించింది. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు నిర్వహించిన పరేడ్ ఆకర్షణీయంగా నిలిచింది.