Air Force Chief On Chopper Crash : భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ కూలిన ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధరి తెలిపారు. ఈ ప్రమాదంలో ఏ చిన్న ఆధారాన్నీ వదిలిపెట్టబోమని అన్నారు. హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శనివారం నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్‌కు వాయుసేనాధిపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ప్రమాదం గురించి ప్రస్తావించారు.
'భారత వాయుసేన అత్యంత శక్తివంతమైనది. వాయుసేనలో పని చేసే అదృష్టం దక్కడం గొప్ప విషయం. శిక్షణలో సమర్థ చూపి గెలిచారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశమే ప్రథమం కావాలి. ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకడుగు వేయొద్దు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా విలువలు మరవద్దు. దేశ సేవలో నిబద్ధతతో పని చేయాలి. సీడీఎస్ రావత్ మరణం దురదృష్టకరం. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో వాయుసేనకు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు. వాతావరణ తప్పిదమా..? మానవ తప్పిదమా..? లేక సాంకేతిక లోపమా? అనేది విచారణ చేస్తున్నాం. ప్రస్తుతం ఈ దర్యాప్తు కొనసాగుతున్నందున దీనిపై ఇప్పుడే ఏం మాట్లాడలేం. ఈ ఘటనపై ఏ చిన్న ఆధారాన్ని కూడా వదిలిపెట్టబోం. ఘటనాస్థలంలో దొరికిన ప్రతి ఆధారాన్ని పరిశీలించాలి. ప్రతి సాక్షిని విచారించాలి. ఇందుకోసం వారాల సమయం పడుతుంది. ఈ ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా జరుగుతుందని హామీ ఇస్తున్నా.’
-మార్షల్ వివేక్ రామ్ చౌధరి, ఎయిర్ ఫోర్స్ చీఫ్
సరిహద్దుల్లో బెదిరింపులు వస్తూనే ఉంటాయి..