Parents Protest: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి సంస్కృతి టౌన్షిప్లో సినీ నటుడు మంచు మోహన్ బాబు ఛైర్మన్‌గా ఉన్న శ్రీవిద్యానికేతన్ పాఠశాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలను మూసివేస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం అన్ని సౌకర్యాలు ఉన్న శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో చేర్పించామని చెప్పారు.
ఆకస్మికంగా మూసివేయడమేంటి?.. శ్రీవిద్యానికేతన్ పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన - telangana news
Parents Protest: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని సంస్కృతి టౌన్షిప్లో ఉన్న శ్రీవిద్యానికేతన్ పాఠశాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలను మూసివేస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం ప్రకటించిందని.. ఆకస్మికంగా పాఠశాల మూసివేస్తున్నట్లు ప్రకటించడం ఏమిటని వారు ప్రశ్నించారు
ఆకస్మికంగా పాఠశాల మూసివేస్తున్నట్లు ప్రకటించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. సింగపూర్ టౌన్షిప్ నిర్మాణ సమయంలో 2009లో సుమారు 7ఎకరాలకు పైగా భూమిని శ్రీ విద్యానికేతన్ పాఠశాల ఏర్పాటుకు హౌసింగ్ బోర్డు అతి తక్కువ ధరకు ఇచ్చిందని తల్లిదండ్రులు చెప్పారు. కరోనా నేపథ్యంలో తమ పిల్లలు చదువులో వెనకబడిపోయారని, మరో పాఠశాలలో చేర్పిస్తే మరింత నష్టపోయే ప్రమాదం ఉందని వారు వాపోయారు. వెంటనే మోహన్‌బాబు పాఠశాలను మూసివేయడం నిర్ణయాన్ని విరమించుకోవాలని లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి:
TAGGED:
ts news