మేడ్చల్ జిల్లా కీసర మండలం దాయరలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ అంతర్జాతీయ శిక్షణ కేంద్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు హాజరై జ్యోతి వెలిగించి ఆరంభించారు. గ్రామీణ ప్రజలను చైతన్య పరుస్తూ పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడేది బాలవికాస సంస్థ అని కొనియాడారు. ఏపీ, తెలంగాణలోని అనేక గ్రామాలు, పట్టణాలతో పాటు దేశంలోని ఆరు రాష్ట్రాల్లో సేవలందిస్తున్న మొట్టమొదటి సంస్థ అని కితాబిచ్చారు.
మేడ్చల్ జిల్లాలో అంతర్జాతీయ శిక్షణ కేంద్రం ప్రారంభం
ఓ సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఒక సీఎస్ఆర్ శిక్షణ కేంద్రంను ఇక్కడ ప్రారంభించడం రాష్ట్రానికే గర్వకారణమని మంత్రి హరీశ్ రావు అన్నారు. మేడ్చల్ జిల్లాలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ అంతర్జాతీయ కేంద్రం ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు.
మేడ్చల్ జిల్లాలో అంతర్జాతీయ శిక్షణ కేంద్రం ప్రారంభం
ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కర్ణాటక మాజీ వ్యవసాయ శాఖ మంత్రి శివశంకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయ, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, బాలవికాస వ్యవస్థాపకులు బాలాతెరిస్సా, కెనడా ప్రతినిధులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : తెరాసను ఓడించి కేసీఆర్కు ఝలక్ ఇద్దాం : ఉత్తమ్