తెలంగాణ

telangana

By

Published : May 3, 2021, 5:36 PM IST

ETV Bharat / state

ప్రతాప్‌సింగారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

మేడ్చల్‌ జిల్లా ప్రతాప్‌సింగారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పరిషత్‌ అధ్యక్షుడు మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి ప్రారంభించారు. సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. వరి సాగుతో పాటు ఉద్యాన పంటల సాగుపైనా దృష్టి సారించాలన్నారు.

grain purchasing center, ikp at Pratap Singaram, medchal
grain purchasing center, ikp at Pratap Singaram, medchal

తెరాస ప్రభుత్వం రైతుల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని మేడ్చల్‌ జిల్లా పరిషత్‌ అధ్యక్షుడు మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి అన్నారు. ఘట్‌కేసర్‌ మండలం ప్రతాప్‌సింగారం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

నాణ్యమైన ధాన్యానికి మంచి ధర లభిస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రంలోనే ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించారు. వరి సాగుతో పాటు ఉద్యాన పంటల సాగుపైనా దృష్టి సారించాలన్నారు. ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలు, మొక్కలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఎంపీపీ వై.సుదర్శన్‌రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఒరగంటి వెంకటేశ్‌గౌడ్‌, ఎంపీటీసీ ఎం.వెంకట్రామిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి బాసిత్‌, సర్పంచులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:హైదరాబాద్​లో చల్లబడ్డ వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షం

ABOUT THE AUTHOR

...view details