తెలంగాణ

telangana

ETV Bharat / state

పాము కాటేసిందని వెళ్తే.. కరోనా ఉందని తెలిసింది.. - పాముతో పాటు కరోనా కాటు

మేడ్చల్ జిల్లాలోని ఓ మహిళకు పాము కరిచింది. విషయం గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా... ఆమెకు కరోనా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఆమె ఉంటున్న ప్రాంతంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

one women have corona in medchalone women have corona in medchal
పాము కాటేసిందని వెళ్తే.. కరోనా వచ్చిందని తెలిసింది..

By

Published : May 30, 2020, 2:50 PM IST

మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన ఓ మహిళకు ఈ నెల 24న పాము కరిచింది. విషయం గుర్తించిన స్థానికులు ఆమెను వెంటనే నారాయణ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఈ నెల 29న ఆమెకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

విషయం తెలియగానే అప్రమత్తమైన అధికారులు ఆమె అద్దెకు ఉంటున్న ఇంట్లో వారిని వైద్య పరీక్షల కోసం కోఠి ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. ఈ కాలనీలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

ఇవీ చూడండి:తెలంగాణపై కరోనా పంజా... నిన్న ఒక్కరోజే 169 కేసులు

ABOUT THE AUTHOR

...view details