తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. - జీడిమెట్లలో డీసీఎం తగిలి వ్యక్తి మృతి వార్తలు

డీసీఎం వాహనంలో తరలిస్తున్న ఆఫీస్​ క్యాబిన్​ తగిలి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

One person killed in road accident
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

By

Published : Dec 13, 2019, 11:49 AM IST

మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్​స్టేషన్​ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ డీసీఎం వాహనంలో తరలిస్తున్న ఆఫీసు క్యాబిన్​ తగిలి రోడ్డుపై నిలుచున్న బ్రిజ్ మోహన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. డీసీఎం డ్రైవర్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బీహార్ రాష్ట్రానికి చెందిన బ్రిజ్ మోహన్​కు భార్యా, నలుగురు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

ఇదీ చూడండి: బంగారు తెలంగాణ కాదు.. బాకీల తెలంగాణ: రేవంత్

ABOUT THE AUTHOR

...view details