తెలంగాణ

telangana

ETV Bharat / state

డివైడర్​ను ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం - రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం రోడ్డు డివైడర్​ను ఢీకొట్టిన ఘటన మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

road accident in medchal district
డివైడర్​ను ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

By

Published : Jun 7, 2020, 3:52 PM IST

Updated : Jun 7, 2020, 5:12 PM IST

మేడ్చల్ ‌జిల్లా జీడిమెట్ల పీఎస్​ పరిధిలోని హెచ్​ఎంటీ కంపెనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టగా.. ఈ ఘటనలో సందీప్​, సోఫన్​లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా సోఫన్ మృతి చెందినట్లు వైద్యులు నిర్దరించారు. సందీప్ పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

వీరు చింతల్​ నుంచి షాపూర్​నగర్​ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరిద్దరు షాపూర్ నగర్​లోని ఓ ఇండస్ట్రియల్ క్యాంటీన్​లో పనిచేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. బట్టలు కొనుక్కోడానికి చింతల్​లోని ఓ బట్టల దుకాణానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: లారీని ఢీకొట్టిన సింగరేణి బస్సు.. నలుగురికి గాయాలు

Last Updated : Jun 7, 2020, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details