మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి మండలం హైదర్‌నగర్ పరిధిలోని సర్వే నెంబర్ 119లో ఉన్న 8 ఎకరాల 17 గుంటల్లో చెరువు విస్తరించి ఉండేది. గతంలో కొంత ఆక్రమణకు గురై.. ప్రస్తుతం 6 ఎకరాల 20 గుంటలకు చేరింది. చెరువులో పేరుకుపోయిన చెత్తను తొలగించి.. మురికిని శుభ్రం చేయాలని ఎప్పటి నుంచో స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరో విడత హరితహారంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చెరువు సుందరీకరణ పనులు చేపట్టారు. అందులో భాగంగా వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు.
చెరువులో కొందరు అక్రమ కట్టడాలు నిర్మించారని స్థానికులు ఆరోపించారు. ఎఫ్టీఎల్ పరిధిని వదిలి సుందరీకరణ చేపట్టారని తెలిపారు. ఆక్రమణలపై స్పందించిన ఎమ్మెల్యే అరికెపూడి... ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జాదారులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.