మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలో నూతన పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. దానిని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌రావులు ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ కోసం కేటాయించిన స్థలాన్ని పోలీస్ స్టేషన్ కోసం ఇచ్చినందుకు ఎమ్మెల్యేకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు.
కూకట్‌పల్లిలో నూతన పోలీస్‌స్టేషన్ ప్రారంభం - new kukatpally police station opened
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలోని నూతన పోలీస్‌స్టేషన్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు, ఎమ్మెల్సీ నవీన్‌రావులు ప్రారంభించారు. ఎమ్మెల్యేకు కేటాయించిన క్వార్టర్స్‌ను పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి ఇచ్చినందుకు ఎమ్మెల్యేకు సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.
![కూకట్‌పల్లిలో నూతన పోలీస్‌స్టేషన్ ప్రారంభం new kukatpally police station opened](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7395784-11-7395784-1590753315767.jpg)
కూకట్‌పల్లిలో నూతన పోలీస్‌స్టేషన్ ప్రారంభం
ఎమ్మెల్యే నిధులతో భవనాన్ని నిర్మించి తమకివ్వడంపై పోలీసులు సంతోషం వ్యక్తం చేశారు. నూతన పోలీస్‌స్టేషన్‌ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సీపీ సజ్జనార్ తెలిపారు. ఎవరికి ఎలాంటి ఆపద ఉన్నా.. తాము వెంటనే స్పందిస్తామని సీపీ వెల్లడించారు.
ఇవీ చూడండి :మిడతల రోజూ ప్రయాణం 130 కిలోమీటర్లు.. ఆ జాగ్రత్తలు పాటించాలి!