మేడ్చల్ జిల్లా గాజులారామరంలోని బతుకమ్మబండ బస్తీకి చెందిన సరిత, సింగ్ దంపతులకు ఇద్దరు సంతానం. శేషు అనే మహిళ మాయమాటలకు తలొగ్గిన సింగ్... రెండు నెలల బాబును 18వేలకు విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. మహేశ్, యాదమ్మ అనే మరో ఇద్దరితో కలిసి బాబును అమ్మేందుకు సన్నాహాలు చేశాడు.
''నా భర్త నాకు తెలియకుండా బాబును అమ్మేశాడు. శేషు, మహేశ్, యాదమ్మ మా ఇంటికి వస్తూ ఉండేవారు. కానీ వాళ్లు ఇలా చేస్తారనుకోలేదు. ఈ రోజు ఉదయం లేచి చూసే సరికి బాబు కనిపించలేదు. నాలుగు గంటలకే నన్ను వరంగల్‌కు వెళ్దామని తీసుకెళ్లేందుకు నా భర్త ప్రయత్నించాడు.''
-సరిత, పసికందు తల్లి
ఈ క్రమంలో తెల్లవారుజామునే శిశువును బ్యాగ్‌లో వేసుకుని అక్కడి నుంచి శేషు పరారైంది. బిడ్డలేక రోదిస్తున్న తల్లిని చూసిన స్థానికులు విషయం తెలుసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగాకేసు నమోదు చేసుకున్నారు.