తెలంగాణ

telangana

ETV Bharat / state

తండ్రే హంతకుడు.. యువతి హత్య కేసులో వీడిన మిస్టరీ - undefined

కన్న తండ్రే కాలయముడయ్యాడు. కూతురని కూడా చూడకుండా మృగాడిలా రెచ్చిపోయి అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు. మేడ్చల్‌ పరిధిలో నిన్న జరిగిన యువతి హత్య కేసులో నిందితుడు సుబ్రహ్మణ్యంను పోలీసులు అరెస్ట్​ చేశారు. మృతురాలు నిందితుడి మొదటి భార్య కూతురిగా గుర్తించారు.

మేడ్చల్‌లో యువతి హత్య కేసులో వీడిన మిస్టరీ

By

Published : Jul 21, 2019, 10:49 AM IST

మేడ్చల్‌లో నిన్న జరిగిన యువతి హత్య కేసులో మిస్టరీ వీడింది. కన్న తండ్రే అత్యాచారం చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. బస్తీలోని ఓ ఖాళీ స్థలంలో ఉన్న సంచిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకొని పరిశీలించగా గుర్తు తెలియని బాలిక గొంతుకోసి ఆనవాళ్లు తెలియకుండా కిరతకంగా హతమర్చారు. హత్యాస్థలంలో ఆధారాలు లభించకపోవటం వల్ల కేసు దర్యాప్తు కష్టంగా మారింది. దీనిని సవాలుగా తీసుకున్న పోలీసులు డాగ్‌స్వ్కాడ్‌ సాయంతో కేసును చేధించారు. తండ్రి సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి ఇద్దరు భార్యలున్నారని, మృతురాలు పెద్ద భార్య కుమార్తెనని పోలీసులు తెలిపారు.

మేడ్చల్‌లో యువతి హత్య కేసులో వీడిన మిస్టరీ

For All Latest Updates

TAGGED:

KISHAN

ABOUT THE AUTHOR

...view details