నిబంధనలు అతిక్రమించి నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని బోడుప్పల్ నగరపాలక సంస్థ అధికారులు సీజ్ చేశారు. మియాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని సర్వే నంబరు 6లోని రెడ్డి కాలనీలో ఓ స్థిరాస్తి వ్యాపారి నిర్మించిన భవనానికి సంబంధించి అనుమతి పత్రాలు చూపాలని అధికార్లు పలుమార్లు సూచించారు.
అనుమతులు లేకుండా నిర్మించిన ఐదంతస్తుల భవనం సీజ్ - తెలంగాణ తాజా వార్తలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై చర్యలకు అధికారులు శ్రీకారం చూట్టారు. మియాపూర్ రెవెన్యూ పరిధిలో నిబంధనలు అతిక్రమించి నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు.
మల్కాజిగిరి జిల్లా
ఎంతకాలమైనా భవనం యజమాని నుంచి స్పందన లేకపోవడం వల్ల మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్ ఆదేశాలపై అధికారులు భవనాన్ని సీజ్ చేశారు. సీల్‌ను తొలగిస్తే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.