తెలంగాణ

telangana

ETV Bharat / state

'మంత్రులు కేటీఆర్​, మల్లారెడ్డిని కేబినెట్​ నుంచి తొలగించాలి' - దేవరయాంజల్‌ సీతారామస్వామి ఆలయ భూములు

మేడ్చల్‌ జిల్లా దేవరయాంజల్‌ సీతారామస్వామి ఆలయ భూములను ఎంపీ రేవంత్ రెడ్డి పరిశీలించారు. గ్రామ పరిధిలోని నిషేధిత భూముల్లో అక్రమంగా వేసిన 84 ఎక‌రాల వెంచర్‌ను పర్యవేక్షించారు. 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నా ఎలా రిజిస్ట్రేష‌న్లు చేస్తున్నారని మండిపడ్డారు.

mp revanth reddy visited devarayangal lands
mp revanth reddy visited devarayangal lands

By

Published : May 6, 2021, 8:01 PM IST

'మంత్రులు కేటీఆర్​, మల్లారెడ్డిని కేబినెట్​ నుంచి తొలగించాలి'

మేడ్చల్‌ జిల్లా దేవరయాంజల్‌ సీతారామస్వామి ఆలయ భూములను ఆక్రమించిన మంత్రులు కేటీఆర్​, మ‌ల్లారెడ్డిని కేబినెట్​ నుంచి తొల‌గించాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గ్రామ పరిధిలోని నిషేధిత భూముల్లో అక్రమంగా వేసిన 84 ఎక‌రాల వెంచర్‌ను ప‌రిశీలించిన రేవంత్‌... 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నా ఎలా రిజిస్ట్రేష‌న్లు చేస్తున్నారని మండిపడ్డారు. 657 స‌ర్వే నెంబర్‌లోని ఫాంహౌస్‌కు ఐఏఎస్​ బృందం ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

దేవుడి మాన్యాల‌ను ప‌రిర‌క్షించాల‌నే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని ఎంపీ విమర్శించారు. సైనిక నిబంధ‌న‌లు ఉల్లంఘించి 45 అడుగులకు పైగా కార్యాల‌యాలు నిర్మించారన్న రేవంత్ రెడ్డి.. గ్రేట‌ర్ ప‌రిధిలోని అక్రమ నిర్మాణాల‌పై మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌, రేరా ఛైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నుంచి స్పంద‌న రాకుంటే న్యాయ‌స్థానాల‌కు వెళ్తామని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:నిరాదరణకు గురవుతున్న నిరాశ్రయులు..

ABOUT THE AUTHOR

...view details