తెలంగాణ

telangana

ETV Bharat / state

'మేడ్చల్​, గుండ్లపోచం పల్లిలో కాంగ్రెస్​ విజయం ఖాయం' - ఎంపీ రేవంత్​రెడ్డి తాజా వార్త

మేడ్చల్​ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని ఎంపీ రేవంత్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెరాస డబ్బుమూటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని కానీ ప్రజలు అభివృద్ధికై పాటు పడుతున్న కాంగ్రెస్​కు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

mp revanth reddy municipal meeting in medchal
'మేడ్చల్​, గుండ్లపోచం పల్లిలో కాంగ్రెస్​ విజయం ఖాయం'

By

Published : Jan 4, 2020, 1:14 PM IST

సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే... 'కేటీఆరే​ ముఖ్యమంత్రి' అంశం తెరమీదకు తెచ్చారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి విమర్శించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తిరుగులేని విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్, గుండ్ల పోచంపల్లి పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా పంచాయతీ రాజ్ చట్టాన్ని నిర్మించారని రేవంత్‌ ఆరోపించారు. స్థానిక సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్‌కే ఓటెయ్యాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

'మేడ్చల్​, గుండ్లపోచం పల్లిలో కాంగ్రెస్​ విజయం ఖాయం'
ఇవీచూడండి: ప్రతి ఒక్కరూ.. ఈచ్ వన్ టీచ్ వన్ ప్రతిన తీసుకోవాలి

ABOUT THE AUTHOR

...view details