రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఉద్యమ సమయంలో పనిచేసిన తెరాస కార్యకర్తలకు అన్యాయం చేయడంతోపాటు టికెట్లను అమ్ముకుంటున్నారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేయర్ స్థానానికి 5 కోట్లు,మున్సిపల్ ఛైర్మన్ స్థానానికి మూడు కోట్లు, కౌన్సిలర్ స్థానానికి 25 లక్షల రూపాయల చొప్పున టికెట్లను బహిరంగ మార్కెట్లో పెట్టి అమ్మకాలు చేపట్టారని ఆయన విమర్శించారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహరిస్తున్న తీరు నచ్చక తెరాస నుంచి కాంగ్రెస్లోకి నేతలు వస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రి మల్లారెడ్డి టిక్కెట్లు అమ్ముకోవడం ఇష్టం లేకనే కాంగ్రెస్లో చేరినట్లు దర్గా దయాకర్ రెడ్డి తెలిపారు.
తెరాసలో మేయర్ పదవికి రూ.5 కోట్లు: రేవంత్ రెడ్డి - MP Revanth Reddy today news news
మేడ్చల్ జిల్లాలోని నగర పాలక, పురపాలక సంస్థలకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగర వేస్తామని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెరాస నేత దర్గా దయాకర్ రెడ్డి... తన అనుచరులతో కలిసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
![తెరాసలో మేయర్ పదవికి రూ.5 కోట్లు: రేవంత్ రెడ్డి MP Revanth Reddy today news news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5660289-633-5660289-1578640689702.jpg)
MP Revanth Reddy today news news