తెలంగాణ

telangana

ETV Bharat / state

కరెన్సీపై అంబేడ్కర్​ బొమ్మనూ ముద్రించాలి: రేవంత్​ - telangana varthalu

కరెన్సీపై గాంధీతో పాటు అంబేడ్కర్​ బొమ్మను ముద్రించాలని కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​ రెడ్డి డిమాండ్​ చేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాస్తానని చెప్పారు.

mp revanth reddy
కరెన్సీపై గాంధీతో పాటు అంబేడ్కర్​ బొమ్మను ముద్రించాలి: రేవంత్​

By

Published : Apr 17, 2021, 8:28 PM IST

కరెన్సీపై మహాత్మగాంధీతో పాటు డాక్టర్‌ బీఆర్.అంబేడ్కర్‌ బొమ్మను ముద్రించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం లింగాపూర్‌ గ్రామంలో నవచైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్‌రాం విగ్రహ ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు. ఇదే విషయం పార్లమెంటు సమావేశంలో మాట్లాడాలనుకున్నానని... కానీ అవకాశం రాలేదన్నారు. ఈ విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాయనున్నట్లు రేవంత్‌రెడ్డి చెప్పారు.

రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయంలో అంబేడ్కర్‌, జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్‌రాం విగ్రహాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. 150 అడుగుల ఎత్తు అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌... నేటి వరకు కనీసం చిన్న గుంత కూడా తీయలేదన్నారు. విగ్రహం ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మాస్క్​తో ఆంజనేయస్వామి కరోనోపదేశం

ABOUT THE AUTHOR

...view details