Revanth Reddy Parliament Speech : జాతీయ రహదారి నిర్మాణాల్లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. యూపీఏ హాయాంలో 37 శాతంగా ఉన్న ప్రైవేట్ భాగస్వామ్యాన్ని 7శాతానికి తగ్గించారని తెలిపారు. ఉపరితల రవాణా, రహదారులు అంశంపై లోకసభలో మాట్లాడిన ఆయన.. తెలుగు రాష్ట్రాల్లోని పలు జాతీయ రహదారులను విస్తరించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కేంద్రానికి రేవంత్ రెడ్డి సూచించారు.
హైవేల విస్తరణకు నిధులిచ్చి పనులు చేపట్టట్లేదు: రేవంత్ - రేవంత్ రెడ్డి వార్తలు
Revanth Reddy Parliament Speech : తెలుగు రాష్ట్రాల్లోని పలు జాతీయ రహదారులను విస్తరించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. భారత మాల ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన జాతీయ రహదారులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు.

parliament
భారత మాల ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన జాతీయ రహదారులను త్వరితగతిన పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్- విజయవాడ నాలుగు లైన్ల రహదారిని విస్తరిస్తామని కేంద్రం చెప్పిందని అన్నారు. 4 లేన్ల హైవేను 6 లేన్లుగా విస్తరిస్తామని నిధులు కేటాయించినదని చెప్పారు. ఇంకా హైవే విస్తరణ పనులను చేపట్టడం లేదని విమర్శించారు. తెలంగాణలో ఇంకొన్ని హైవేలకు నిధులు ప్రకటించి పనులు చేపట్టట్లేదని పేర్కొన్నారు.
హైవేల విస్తరణకు నిధులిచ్చి పనులు చేపట్టట్లేదు: రేవంత్
ఇదీ చదవండి :'8ఏళ్లు గడిచినా విభజన చట్టంలోని హామీలు నెరవేరలేదు'