జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్పొరేటర్లను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజుల రామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్ డివిజన్లలో రేవంత్ రెడ్డి... ప్రచారం నిర్వహించారు.
డివిజన్లలోని ప్రధాన సమస్యలు పరిష్కారం కావాలంటే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కనీసం 25 నుంచి 30 మంది కార్పొరేటర్లను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.