తెలంగాణ

telangana

ETV Bharat / state

'బంగారు తెలంగాణ చేస్తామంటూ బాకీల తెలంగాణగా మార్చారు'

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధ్వంస పాలనపై పోరాటమే దిల్లీ రాంలీలా మైదానంలో జరుగుతున్న 'భారత్​ బచావో​' ర్యాలీ అన్ని ఎంపీ రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ప్రజలకు, రైతులకు కాంగ్రెస్​ పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

mp-revanth-reddy-at-bharat-bachao-rally-in-delhi
ప్రజలకు అండగా నిలిచేందుకే 'భారత్ బచావో'

By

Published : Dec 14, 2019, 12:26 PM IST

కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ.. 'భారత్​ బచావో​' పేరిట నేడు దిల్లీలోని రాం​లీలా మైదానంలో జరుగుతున్న కాంగ్రెస్ ర్యాలీకి మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి హాజరయ్యారు. భాజపా ప్రభుత్వ విభజనవాదం, విధ్వంసక వైఖరికి నిరసనగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టేందుకే ర్యాలీ చేపడుతున్నట్లు రేవంత్​రెడ్డి తెలిపారు. రాష్ట్రం నుంచి 4 వేల మంది నేతలు, కార్యకర్తలు దిల్లీ వెళ్లినట్లు పేర్కొన్నారు.

ఏ విషయాన్నైనా ట్విటర్​లో స్పందించే ప్రధాని.. ప్రజా సమస్యలపై ఎందుకు మాట్లాడరంటూ ప్రశ్నించారు. సీఎం నియంతృత్వ పాలనలో రాష్ట్రం బందీ అయ్యిందని రేవంత్​రెడ్డి అభిప్రాయపడ్డారు.

కేసీఆర్​ దోపిడీ ఆపేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎద్దేవా చేశారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానంటూ బాకీల తెలంగాణగా మార్చారని రేవంత్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలకు అండగా నిలిచేందుకే 'భారత్ బచావో'

ఇదీ చదవండిః చీకట్లో డిగ్రీ దూర విద్య పరీక్షల మాస్‌కాపీయింగ్‌

ABOUT THE AUTHOR

...view details