తెలంగాణ

telangana

By

Published : Dec 22, 2019, 7:34 PM IST

ETV Bharat / state

'అవినీతి, భూకబ్జాల్లో తెరాస నేతలు పోటీ పడుతున్నారు'

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ సన్నాహక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై ఎంపీ రేవంత్ రెడ్డి గళమెత్తారు. అభివృద్ధి పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నట్లు విమర్శులు గుప్పించారు. తెరాస నేతలు అవినీతి, భూకబ్జాల్లో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.

Mp Revanth Fires On TRS Government
'అవినీతి, భూకబ్జాల్లో తెరాస నేతలు పోటీ పడుతున్నారు'

తెరాస పాలనలో హైదరాబాద్‌ మహానగరలో అభివృద్ధి ఏమీ జరగలేదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. మంచి నీరు, రహదారులు, పారిశుద్ధ్యం లాంటి మౌలిక సౌకర్యాలు అన్నీ కూడా కాంగ్రెస్ హయంలో జరిగినవేనని ఆయన స్పష్టం చేశారు. దీనిపై స్థానిక కాంగ్రెస్‌ నాయకులతో చర్చించేందుకు తెరాస నాయకులు సిద్ధమా అని సవాల్‌ విసిరారు.

భూకబ్జాలు, అనుమతి లేని భవంతుల నిర్మాణంలో తెరాస నేతలు పోటీ పడుతున్నారని రేవంత్​ ఎద్దేవా చేశారు. మంత్రులు మొదలు కార్పొరేటర్ల వరకు పిశాచుల్లా ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అడిగే వారు లేకపోవటం వల్లే తెరాస ఆగడాలు పరాకాష్టకు చేరాయన్న రేవంత్‌ రెడ్డి... మున్సిపల్‌ ఎన్నికల్లో మరోసారి తెరాసను గెలిపిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి బోసరాజు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మేడ్చల్‌ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్‌తోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

'అవినీతి, భూకబ్జాల్లో తెరాస నేతలు పోటీ పడుతున్నారు'

ఇదీ చూడండి: నేడు రాజ్​భవన్​లో రాష్ట్రపతికి విందు

ABOUT THE AUTHOR

...view details